మనతెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరో వివాదం రాజుకుంది. సిఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. గతంలో కూడా సిఎంను టార్గెట్ చే స్తూ.. ఆయన కుటుంబ సభ్యులపై సుస్మిత చేసిన కామెం ట్స్ రాజకీయాలను కుదిపేసిన విషయం విదితమే. కొం డా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అదే సమయంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌తో వెళ్లి సిఎం రేవంత్‌ను కలిసి వివరణ ఇవ్వడంతో వివాదానికి సద్దుమణిగింది. అయితే సిఎం రేవంత్ జిల్లా పర్యటనలకు వచ్చిన సమయంలో

మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని ములుగు, పరకాల నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన సిఎం సభలకు జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సభలో పరకాల నుంచి మరోసారి ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తారని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించడమే రాజకీయ అగ్గికి కారణమైంది. పరకాల అసెంబ్లీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని మంత్రి సురేఖ కూతురు సుస్మిత భావిస్తున్నారు. గతంలో ఈ స్థానం నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. కొండా దంపతుల స్వగ్రామమైన గీసుకొండ మండలం వంచనగరి పరకాల అసెంబ్లీ పరిధిలో ఉంది.

గత ఎన్నికల్లో పరకాల నుం చి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవూరికి కొండా దంపతులు అండగా నిలిచారు. ఆయన గెలుపులో కీలక భూమి క పోషించారు. అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి రేవూరితో కొండా దంపతులకు పొసగ డం లేదు. పరకాల నియోజకవర్గంలో రెండు వర్గాలుగా క్యాడర్ విడిపోయి పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సందర్భాలు ఉన్నా యి. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయాలని కొండా కుటుంబం భావిస్తోంది. ఇప్పటికే మంత్రి సురేఖ కూతురు సుస్మిత పోటీపై స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ పరకాలపై కొండా సుస్మిత పెట్టుకున్న ఆశలపై సిఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నీళ్లు చల్లేలా చేసింది. దీంతో అగ్గిమీద గుగ్గిలంలా ఉన్న కొండా సుస్మి త నేరుగా సిఎంతోపాటు ఆయన తమ్ముడిని టార్గెట్ చేశా రు. రెండేళ్ల ముందే టికెట్ల ప్రకటన చేయడం ఏమిటని మండిపడ్డారు. ఒరిజినల్ కాంగ్రెస్‌ను చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చ కాంగ్రెస్ పెత్తనం చేస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడివే కాంగ్రెస్ పా ర్టీతోపాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరో అడుగు ముందుకేసిన మంత్రి సురేఖ కూతురు సు స్మిత.. తాను చేసిన కామెంట్స్‌పై ఎవరైనా కౌంటర్ చేస్తే.. ప్రభుత్వ అవినీతి చిట్టా విప్పుతానని అల్టిమేటం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. వయసు మీరిన పరకాల ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇస్తారా అంటూ ప్రశ్నించారు.

సుస్మిత వ్యాఖ్యలతో సురేఖకు..

గతంలో సిఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల టార్గెట్‌గా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన సంచలన కామెంట్స్ రాజకీయాలను కుదిపేశాయి. ఒక దశలో కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని ప్రచా రం సాగింది. ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న దశలో మరోమారు సుస్మిత చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృ ష్టించాయి. మళ్లీ మంత్రి సురేఖ పదవికి ఏమైనా గండం వస్తుందా అనే చర్చ మొదలైంది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో సుస్మిత కామెంట్స్ సురేఖకు ఇబ్బందికరమని భావిస్తున్నారు. ఇదే అదను గా సొంత పార్టీలోనీ ఆమె రాజకీయ ప్రత్యర్థులు కూడా అధిష్ఠానానికి ఉప్పందిస్తున్నారు.

ఆది నుంచి వివాదాలే

కొండా కుటుంబ రాజకీయ నేపథ్యం అంతా వివాదాల పునాదులపై నిర్మితమైంది. మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో సొంత పార్టీలో తిరుగుబాటు చేయడం కొండా దంపతులకు కొత్తేమీ కాదు. వాళ్ల వారసత్వం స్వీ కరించేందుకు ఉవ్విళ్లూరుతున్న సుస్మిత కూడా అదే మా ర్గాన్ని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. తమను నమ్ముకున్న వాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్లడం.. తాము న మ్ముకున్న నాయకుడి వద్ద గౌరవం దక్కకపోతే పోరాటం చేయడమే కొండా దంపతులకు బలంగా ఉంది. ప్రస్తుతం సుస్మిత కూడా తండ్రి బాటలో రాజకీయాలు చేయాలని దూకుడుగా వెళ్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అప్పటికి.. ఇప్పటికీ చాలా తేడా ఉన్నందున దూకుడుతనంపై చాలామంది పెదవి విరుస్తున్నారు.