మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా కక్షపూరిత ధోరణితో ఆయనపై కేసులు నమోదు చేసి వేధించడం ఎంతమాత్రం సరికాదని బిఆర్‌ఎస్ అగ్రనేత హరీష్ రావు ఎక్స్ వేదికగా హితవు పలికారు. ప్రొఫెసర్‌పై పెట్టిన అన్ని కేసులను ఎపి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.