
వాషింగ్టన్ : భారత్ ప్రపంచాన్ని ఆధిపత్యం చేయాలనే లక్షంతో ‘మహాశక్తి ’గా ఎదగలేదని, తన సంస్కృతి, సేవాభావం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా “ విశ్వగురు”గా గుర్తింపు పొందిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ అన్నారు. కెనడా లోని టోరంటోలో జరిగిన హిందూ సమాజ కార్యక్రమంలో భారత్ పాత్రపై ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభం వచ్చినప్పుడు భారత్ అవసరమైన వారికి సహాయ హస్తం అందించిందని, ఇతర దేశాల ప్రజలకు ఆశ్రయం కల్పించడం భారత సంప్రదాయంలో భాగమని పేర్కొన్నారు.
“వసుధైక కుటుంబం” భావనను ప్రస్తావిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని వివరించారు. భారతీయుల పూర్వీకులు ప్రపంచం లోని అనేక ప్రాంతాలకు వెళ్లినా, ఇతర దేశాలను ఆక్రమించలేదని, దండయాత్రలకు బదులుగా గణితం, ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం , నాగరికతా విలువలను పంచుకున్నారని చెప్పారు.











