నవతెలంగాణ – హైదరాబాద్‌ : మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రయివేటు ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

The post ప్రయివేటు ట్రావెల్‌ బస్సు దగ్ధం appeared first on Navatelangana.