
గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం, యశ్వీర్ కాంస్య పతకం సాధించారు. వీరిద్దరిని అభినందిస్తూ.. ప్రధాని మోడీ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.
‘‘గ్లాస్గో వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు. రజత పతకం అందుకొన్నాడు. నిలకడ, సంయమనం, స్పూర్తిని ప్రదర్శించాడు. అతడి విజయం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. మున్ముందూ ఇదే ఉత్సాహంతో సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా. కంగ్రాట్స్ యశ్వీర్. అద్భుతంగా పతకం సాధించావు. క్రీడపై నీకున్న ఆసక్తి, నిబద్ధతకు ఇదే తార్కాణం. యువ అథ్లెట్లకు స్పూర్తిగా నిలిచావు’’ అని మోడీ పోస్టు చేశారు.
‘‘జూడో 57 కేజీల విభాగంలో రజతం గెలిచిన యామిని మౌర్య, డెకథ్లాన్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన తేజశ్విన్ శంకర్‌కు శుభాకాంక్షలు. జూడో పట్ల యామిని అభిరుచి అద్వితీయం. ఎక్కువ మంది యువత జూడో వైపు వచ్చేందుకు ఆమె విజయం బాటలు వేస్తుంది. ఇక పది ఈవెంట్లలో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన తేజశ్విన్ కష్టానికి తగిన ప్రతిఫలం అందింది. మున్ముందూ ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని మోడీ పేర్కొన్నారు.










