యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఇటీవల చిత్ర రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన ఓ పోస్టర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెంచేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఫ్యాన్స్‌ని మరింత ఖుషి చేస్తోంది. అదేంటంటే.. ఇందులో ప్రభాస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సైనికుడిగా కనిపించనున్నారట. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశమని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ తొలుత బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా చేరి ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరుతారట. అయితే దీనిపై ఇప్పటికైతే ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇక ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కానున్న విషయం తెలిసిందే.