హైదరాబాద్: ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను స్పెయిన్ కైవసం చేసుకుంది. స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై గోల్స్ చేసి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. అదనపు సమయంలో స్పెయిన్‌కు చెందిన ఆటగాడు టోరెస్ గోల్ చేశాడు. దీంతో ఆదేశపు ఆటగాళ్లు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి స్పెయిన్ ఆధిపత్యం చెలాయించింది. స్పెయిన్ దిగ్గజ ఆటగాడు అర్జెంటీనా ఒత్తిడిలోకి నెట్టేశాడు. అర్జెంటీనా రక్షణ డిఫెన్స్‌ను చివరి వరకు పరీక్షిస్తూనే స్పెయిన్ ముందుకు సాగి విజయం సాధించింది. అర్జెంటీనా ఆత్మరక్షణకే పరిమితమైంది కానీ ఎక్కడా గోల్ చేయడానికి ప్రయత్నించలేదు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సి పెద్ద ప్రభావం చూపలేదు. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినేజ్ విరోచితంగా పోరాటం చేయడంతో పాటు అదనపు సమయానికి తీసుకెళ్లాడు. మార్టినేజ్ అని సేవ్‌లు చేయకపోతే అర్జెంటీనా జట్టు తొలుత అర్ధ భాగంలోనే ఓటమిని చవిచూసేది. అర్జెంటీనా జట్టు ఆటగాడు ఫెర్నాండేజ్ రెడ్ కార్డుతో మైదానం వీడడంతో ఆ జట్టు పది మందిలో ఆడాల్సి వచ్చింది. ఈ విషయంలో స్పెయిన్‌కు కలిసి రావడంతో పెరాన్ టోరెస్ గోల్ చేసి స్పెయిన్ విజయాన్ని అందించాడు. ఫిపా వరల్డ్ కప్ గెలిచిన స్పెయిన్‌కు రూ.481 కోట్లు వచ్చాయి. రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టుకు రూ.317 కోట్లు అందుకుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఇంగ్లాండ్, ప్రాన్స్ జట్లకు రూ.279 కోట్లు, రూ.259 కోట్లు దక్కాయి. పది గోల్స్ కోట్టిన ప్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబాపేకు గోల్డెన్ బూట్ దక్కింది. స్పెయిన్ 2010, 2026 ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకుంది. బ్రెజిల్ అత్యధికంగా ఐదు సార్లు గెలుచుకొని తొలి స్థానంలో ఉంది. జర్మనీ నాలుగు సార్లు, ఇటలీ నాలుగు సార్లు, అర్జెంటీనా మూడు, ఉరుగ్వే రెండు, ఫ్రాన్స్ కూడా రెండు సార్లు ఫీఫా వరల్డ్ కప్‌ను గెలుచుకున్నాయి.,