
హైదరాబాద్: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. రెండు ప్రత్యేక బృందాలు ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్నాయి. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ గత నెల 22న నార్సింగి పోలీసులకు మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు 69 బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాసింగ బలాలు వంటి వరస హిట్ పాటతో ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్న విషయం విధితమే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.








