
ఈరోజుల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం సర్వసాధారణమైపోయింది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. మరి ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా అని చాలామంది చర్చించుకుంటున్నారు. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించవచ్చు లేదా తొలగించవచ్చు. అయితే, ఈ పరిస్థితి ఫైబ్రోసిస్‌కు దారితీయకపోతే, లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనివల్ల కాలేయ మార్పిడి చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటె ఆహారం నుండి వ్యాయామం వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. కాలేయ ఆరోగ్యంలో మెరుగుదల స్థాయిని సూచించే SGPT పరీక్షను నెలవారీగా చేయించుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో కాలేయం నుండి కొవ్వును గణనీయంగా తగ్గించడానికి లేదా తొలగించడానికి ఉపయోగపడే చిట్కాలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.
5,000 నుండి 7,000 అడుగులు
వారానికి ఒక వ్యాయామ ప్రణాళికను రూపొందించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇందులో ఐదు రోజులు వేగంగా నడవడం, రెండు రోజులు బలవర్ధక వ్యాయామాలు చేయడం మంచిది. అలాగే భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల పాటు నడవడం వంటి దినచర్యను కూడా పాటించాలి. ప్రధానంగా, ఉదయాన్నే నడవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో సూర్యరశ్మి విటమిన్ డి ని అందిస్తుంది. ఈ పోషకం ఆరోగ్యకరమైన కాలేయాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
చక్కెరకు దూరంగా
ఫ్యాటీ లివర్ సమస్య ఉంటెయ్ వెంటనే చక్కెర పదార్థాలు తినడం మానుకోవాలి. స్వీట్స్, చక్కెర కలిపిన టీ, ఇతర షుగర్ ఐటమ్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే చక్కెర కాలేయాన్ని వేగంగా దెబ్బతీస్తుంది. ఒకవేళ చక్కెర వినియోగాన్ని తాగించలేకపోతే, దానిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
ఆకుకూరలు
పాలకూర, బ్రోకలీ, సొరకాయ, బీరకాయ, కాకరకాయ వంటి ఆకుకూరలను డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా ఈ ఆకుకూరలు కాలేయంలోని వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే, రోజూ బ్రెడ్ లేదా బిస్కెట్ల వంటి బేకరీ పదార్థాలను తినే అలవాటు ఉంటె
వాటిని తీసుకోవడాన్ని పరిమితం చేసుకోవాలి.
ప్రోటీన్ వనరులు
ప్రోటీన్ ఫ్యాటీ లివర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. శాకాహార ప్రోటీన్ కోసం, పెసలు, శనగలు, చిక్కుడు కాయలు, మొలకలు, పనీర్ లేదా టోఫు తీసుకోవాలి. మాంసాహారం కోసం, గుడ్లు, గ్రిల్డ్ చికెన్, చేపలు తీసుకోవాలి. అలాగే మేక మాంసం విటమిన్ బి12కు మంచి వనరు. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.










