పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో భారీగా మోహరించిన పోలీసులునవతెలంగాణ–సంగారెడ్డిఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి జాతీయ రహదారి-65పై బైఠాయించి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి పిలుపు నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి […]
The post రాహుల్ అరెస్టు.. ఎన్‌హెచ్-65పై బైఠాయింపునకు జగ్గారెడ్డి పిలుపు appeared first on Navatelangana.












