
ఐపిఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ బ్యాటర్లు మరో 9 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ(57), ఇషాన్ కిషన్(74) అర్ధ శతకాలతో చెలరేగి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, నితీష్ కుమార్ రెడ్డి(36), క్లాసెన్(29)లు కూడా రాణించారు. దీంతో సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 229 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
అంతకుముందు, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు నమోదు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ శతకంతో విధ్యంసం సృష్టించాడు. తొలి ఓవర్ నుంచే భారీ సిక్సులతో బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసిన సూర్యవంశీ.. మొత్తం 37 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అలాగే, ద్రువ్ జురేల్(51), ఫెర్రీరా(33)లు రాణించారు.












