రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్‌టిపిసి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని డిసిఎం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. డిసిఎం ముందుబాగం నుజ్జునుజ్జుగా మారడంతో డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. డిసిఎం క్యాబిన్‌లో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.