రాష్ట్ర రోడ్లు భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విప్ ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య లను శుక్రవారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వాటర్స్ లో మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్త మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి, విప్ లకు పుష్ప గుచ్చాలను అందజేశారు.