
హైదరాబాద్: భారత్ లో మంచి కాలేజీలే లేవని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అంటున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అని రాష్ట్రంలో మంచి స్కూళ్లు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ప్రశ్నించారు. కెటిఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల పాటు సరిపడా టీచర్లను నియమించలేదు? అని పదేళ్ల పాటు యూనివర్సిటీల్లో ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు? అని బండి ప్రశ్నించారు. స్కూళ్లు బాగాలేవని కొన్నాళ్ల క్రితం మాజీ సిఎం కెసిఆర్ మనవడు చెప్పాడని, కాలేజీలు బాగా లేదని ఇప్పుడు కెసిఆర్ మనవరాలు చెప్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.








