న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, విస్తరణపై రాజకీ య వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతితో సమావేశం తరువాత రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత చి త్రాలను విడుదల చేసింది. రాష్ట్రపతి ముర్ము మాల్దోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దే శాల్లో వారం రోజుల పాటు పర్యటించిన తరువాత ఆదివారం తిరిగి వచ్చాక ఈ భేటీ జరిగిం ది. ఇరువురు చర్చించిన అంశాలపై ఎలాంటి వివరాలు విడుదల కాలేదు. కాగా, అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు సీనియర్ మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. గురువారంనాడు పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,

విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎరువులశాఖ మంత్రి జెపి నడ్డా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ పికె మిశ్రా ఉన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రపంచంలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చ జరిగింది. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్, కాస్పియన్, నల్ల సముంద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్‌ల గుండా రాకపోకలు, సప్లయ్ చైన్ దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఆయా దేశాల్లో భారతీయుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు ప్రధాని సూచనలు చేశారు. మరోవైపు ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన శుక్రవారంనాడు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.