
హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేత, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరుతో డబ్బులు కూడా తీసుకున్నారని ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే వీడియోలు తీశాడని ఫిర్యాదులో పేర్కొంది. రేగా కాంతారావుపై పోలీసులు బిఎన్ఎస్ 69తో పాటు 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











