పార్టీ స్థాపించిన తర్వాత తొలి ఎన్నికల్లోనే టివికె చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికార డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలను వెనక్కి నెట్టి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు, విజయ్ పోటీ చేసిన పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌.. రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. మరోవైపు, ఆయన పార్టీ టివికె..110కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. దీంతో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పనున్నారు. మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం తక్కువగా ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టివికె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.