నవతెలంగాణ – బల్మూరు మండల పరిధిలోని రామాజీ పల్లి గ్రామంలో ఆదివారం మేక రెండు తలలున్న జీవానికి జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన బక్కమ్మ అనే మేకల కాపరి మేకల మందలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఆయా చుట్టుపక్కల గ్రామస్తులు రెండు తలల మేక పిల్లను చూసేందుకు ఆసక్తిగా అక్కడికి చేరారు. అప్పటికే రెండు తల వింత జీవి మృతి చెందినట్లు మేకల కాపరి వెల్లడించారు.
The post రెండు తలలతో వింత జననం appeared first on Navatelangana.












