మన తెలంగాణ/మోత్కూర్: మాజీ సిఎం కెసిర్, బిఆర్‌ఎస్ నేతలపై కవిత విమర్శలు మానుకోవాలని మోత్కూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పుడు మాట్లాడుతున్నది అప్పటి కవిత కాదని, ఇప్పటి కవిత రేవంత్ రెడ్డి చేతిలోకీలుబొమ్మ అన్నారు. కవితకు ఎన్నో అవకాశాలు ఇస్తే అడ్డమైన పనులు చేసి కోట్లకు పడగలెత్తి ఇప్పుడు పార్టీని, కేసీఆర్‌పై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ఆంధ్రలో అధికారం కోసం చంద్రబాబు జగన్ చెల్లెను పావుగా వాడుకున్నట్లు ఇక్కడ కూడా చంద్రబాబు కనుసన్నుల్లో పనిచేస్తున్న రేవంత్ కూడా కవిత రాజకీయంగా పావుగా వాడుకుంటున్నారన్నారు. వాళ్ళుఆడుతున్న డ్రామాలో నువ్వొక పావులాగా మిగిలిపోతావని అన్నారు. యావత్ తెలంగాణ ఇప్పుడు మాజీ సిఎం కెసిఆర్‌ను మాత్రమే కోరుకుంటుందని, కెసిఆర్‌పై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.