ముంబై: భారత జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న అజింక్య రహానెకు ప్రతిభకు తగినట్టు గుర్తింపు దక్కలేదని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా టెస్టుల్లో రహానె అత్యంత ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. చటేశ్వర్ పుజారాతో కలిసి అతను టెస్టుల్లో నెలకొల్పిన పార్ట్‌నర్‌షిప్‌లే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చన్నాడు. రాహుల్ ద్రవిడ్‌కు సమకాలికుడిగా రహానెను గవాస్కర్ అభివర్ణించాడు. ద్రవిడ్ మాదిరిగానే రహానెకు కూడా టీమిండియాలో తగిన గుర్తింపు దక్కలేదన్నాడు. రోహిత్ శర్మ, ధోనీ, విరాట్ కోహ్లి, పుజారా తదితరులకు లభించినంత ఆదరణ, గౌరవం రహానెకు లభించలేదన్నాడు. అందుబాటులో ఉన్న వారితో జట్టును ముందుకు నడిపించిన తీరు భారత క్రికెట్ చరిత్రలోనే చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలి పోతుందని గవాస్కర్ పేర్కొన్నాడు.