నవతెలంగాణ – హైదరాబాద్ : నటుడు, చిత్రనిర్మాత రిషబ్ శెట్టిని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు’తో సత్కరించనున్నారు. సాంస్కృతికంగా ప్రామాణికమైన, కళాత్మకంగా ఉన్నతమైన కథనాలను ప్రోత్సహించడం ద్వారా భారతీయ సినిమాపై ప్రపంచవ్యాప్త చర్చను విస్తరించడంలో శెట్టి కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ‘కాంతార’, ‘రికీ’ చిత్రాలతో పేరొందిన శెట్టికి ఆగస్టు 13న ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

The post రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ అవార్డ్‌ appeared first on Navatelangana.