అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. రాజీవ్‌నగర్‌కు చెందిన గుణ్ణం విజయ్ ప్రకాశ్ అనే వ్యక్తి నెల్లూరు ఆర్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. జంగాలకండ్రిగాలోని పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి పడిపోవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.