
కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి పై కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై రాజేందర్ మృతి చెందినట్లు అతని భార్యకు ఎపి పోలీసులు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ కు మృతదేహం తీసుకొచ్చిన తర్వాత మృతుడి ఒంటిపై గాయాలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య వసంత ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని మియాపూర్ లో అతడు నివాసం ఉంటున్నాడు. ఆయన ఆర్ టిసి లో కండక్టర్ ఉద్యోగం చేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు.











