
మన తెలంగాణ / హైదరాబాద్ : సమ్మె విరమణతో రాష్ట్రం లో శనివారం ఉదయం తొలిషిప్ట్ నుంచే ఆర్‌టిసి బస్సులు రోడ్లెక్కాయి. మూడు రోజుల సమ్మె తర్వాత బస్సులు యధావిధిగా తిరగడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. గత మూడు రోజులగా నరక యాతన పడ్డ ప్రయాణీకులకు సమ్మె ముగియడంతో ఊరట లభించింది. బస్సులు సాధారణంగా తిరిగాయి. కాగా ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించిన దరిమిలా ఆర్‌టిసి కార్మికుల్లో ఆనందోత్సవాలు తొణికిసలాడా యి. రాజధాని హైదరాబాద్‌లో బస్ భవన్ ముందు జెఎసి నేతలు మిఠాయిలు పంచుతూ ఆనందోత్సవాలు వ్యక్తం చేశా రు. ఆర్‌టిసి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్ డిపోల ముందు కార్మికులు మిఠాయీలు ఒ కరినొకరు తినిపిస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. బా ణ సంచా కాల్చారు. తమ సహోద్యోగి ఆత్మహత్య చేసుకున్న బాధ ఒకవైపు ఉన్నా ప్రభుత్వం డిమాండ్లు ఆమోదించడం వారి మొహాల్లో వెలుగులు నింపింది.
ప్రభుత్వానికి కూనంనేని సాంబశివరావు,
నారాయణ అభినందనలు
ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై సముచితంగా స్పందించి వారి డి మాండ్లను పరిష్కరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ రా ష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ నాయకుడు నారాయణ, జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూ పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కార్మిక సంఘాలతో ప్రత్యక్షంగా చర్చలు జరిపిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లకు అభినందనలు తెలిపారు. తన వంతు పాత్ర నిర్వర్తించిన రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపా రు. సమ్మెలో క్రియాశీలకంగా వ్యవహరించిన నర్సంపేట డి పో ఆర్‌టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి దురదృష్టకరమని, ఆ యన కుటుంబానికి తీరని శోకం మిగిల్చారని సాంబశివరా వు అన్నారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని వి ధాల ఆదుకోవాలని సాంబశివరావు కోరారు.
ఎపి పిటిడి (ఆర్‌టిసి) ఎంప్లాయిస్ యూనియన్ అభినందనలు
తెలంగాణ ఆర్‌టిసి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సా నుకూలంగా పరిశీలించి పరిష్కరించిన తెలంగాణ ప్రభుత్వానికి ఎపి పిటిడి (ఆర్‌టిసి) ఎంప్లాయిస్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించి విజయం సాధించిన తెలంగాణ ఆర్‌టిసి ఉద్యోగుల కు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య విప్లవాభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం విజయవాడలో ప్రకటన విడుదల చేశారు. యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్ర భుత్వం అంగీకరించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. పెండింగ్ వేతన సవరణల పరిష్కార దిశగా అడుగులు పడ టం, ఇతర సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గం, ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం ఉద్యోగుల భవిష్యత్తుకు మేలు చేసే నిర్ణయమని తెలిపారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల హక్కులు దెబ్బతినకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించారు.












