
టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. పైగా, రోహిత్ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. భారత్ ఈ మ్యచ్‌లో ఓడినప్పటికీ రోహిత్ బ్యాటింగ్ ామత్రం అదరగొట్టేశాడు. ఈ అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
బిసిసిఐ టివితో మాట్లాడుతూ ‘‘మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేయడం నా ముఖ్య విధి. దేశానకి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విఫయం. నా అరంగేట్రం రోజు నుెంచి నేటి దాకా అదే నిబద్ధత, అంకితభావంతో ముందుకు సాగుతున్నాను. అంతేకాదు నేను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన రోజు నుంచే ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాను. నేను మళ్లీ మైదానంలోకి వెళ్లే దాక అవి ఆగవు. ఇలాంటి రూమర్లు నాపై ఎలాంటి ప్రభావం చూపించవు’’ అని రోహిత్ పేర్కొన్నాడు.











