19 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధం సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్‌లో జరిగింది.జూలై 25 న రుద్రపూర్‌లోని భూరారాని రోడ్డు సమీపంలో 19 ఏళ్ల యువతిని ముగ్గురు దుండగులు బలవంతంగా అపహరించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం రాత్రి బగ్వాడా ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా నిందితులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రధాన నిందితుడి కాలికి గాయమైంది. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.