హైదరాబాద్‌: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ హత్య చోటుచేసుకుంది. హమేర్ (35) అనే వ్యక్తిపై స్థానిక యువకుడు కొబ్బరికాయలు నరికే కత్తితో అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హమేర్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు హమేర్‌పై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు చర్యలు చేపడుతున్నారు. మృతుడు, నిందితుడు ఇద్దరూ గంజాయి సేవించేవారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.