
‘ఏక్ దిన్’ (తెలుగు డబ్ పేరు: ‘ఒక్క రోజు’) సాయి పల్లవి, జునైద్ ఖాన్ (అమీర్ ఖాన్ కుమారుడు) ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది థాయ్ చిత్రం వన్ డేకి రీమేక్.
కథ :
దినేష్ (జునైద్ ఖాన్) ఒక సిగ్గరి యువకుడు. తనతో పనిచేసే మీరా (సాయి పల్లవి)ను మౌనంగా ప్రేమిస్తుంటాడు. వీరిద్దరూ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. మీరా ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ నకుల్ ను ప్రేమిస్తూ ఉంటుంది. నకుల్ కు ఆల్రెడీ పెళ్లయింది కానీ ఆమెకు అబద్ధం చెబుతూ ఉంటాడు పెళ్ళానికి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెబుతూ ఉంటాడు.
కంపెనీ ఎంప్లాయిస్ అంతా జపాన్ ట్రిప్ కి వెళ్తారు.. అక్కడ ఓ ప్రమాదంలో మీరా గతం మరిచిపోతుంది ఒక్కరోజు మాత్రమే ఆమ్నిషియా ఉంటుంది. ఈ ప్రమాదం తర్వాత మీరాకు టాన్సిట్ గ్లోబల్ అమ్నేషియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆమెకు ఒక రోజు జరిగిన విషయాలు గుర్తుండవు. ఆ ఒక్క రోజులో వారిద్దరి జీవితాల్లో జరిగే సంఘటనలే సినిమా ప్రధాన కథ. ప్రేమ, జ్ఞాపకాలు, భావోద్వేగాలకు ఈ చిత్రం ప్రాధాన్యం ఇస్తుంది. ఆమెకు ఆ ఒక్కరోజు తర్వాత గతం గుర్తుకొస్తుందా ప్రేమికుడుని ఎలా గుర్తిస్తుంది అనేది సినిమా కథ. పాత కమలహాసన్ శ్రీదేవిల వసంత కోకిల సినిమాలా కొంచెం అనిపిస్తుంది. కానీ అది కేవలం కాన్సెప్ట్ మాత్రమే. సినిమా మొత్తం చాలా ఫ్రెష్ గా నూతనంగా ఉంటుంది. కొంత స్లోగా ఉన్నప్పటికీ సినిమా చాలా ఇంట్రెస్ట్ గా సాయి పల్లవి తన నటనతో మ్యాజిక్ చేస్తుంది. జపాన్ లో ఉన్న ఆ లొకేషన్ లో మనకు చాలా కొత్త అనుభూతిని ఇస్తాయి.
నటీనటులు:
సాయి పల్లవి
జునైద్ ఖాన్
కునాల్ కపూర్
సినిమా ఎలా ఉంది?
సాయి పల్లవి నటనకు ప్రశంసలు లభించాయి. భావోద్వేగాలు బాగున్నప్పటికీ కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుందని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. రొమాంటిక్, ఎమోషనల్ సినిమాలు ఇష్టపడేవారికి ఒకసారి చూడదగిన చిత్రం అని చాలా సమీక్షలు పేర్కొన్నాయి. ఏమాత్రం అశ్లీలత లేకుండా ఇంటిల్లిపాది పిల్లలతో సహా ఇంట్లోనే చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. దీనిని తెలుగులో కూడా మనం లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకుని చూడొచ్చు.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు











