
అమరావతి: సాయికృష్ణ కేసుకు కులాన్ని ఆపాదించే ప్రయత్నం సిఎం చేయడం చరిత్రలో తొలిసారి వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఎపిలో పోలీస్ స్టేషన్ కు వెళ్తే తిరిగి వస్తామా అనే భయం పట్టుకుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..పోలీసుల వైఫల్యం ఓ సామాజిక వర్గానికి రుద్దే ప్రయత్నం చేయడం దారుణం అని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. జైల్లోనే సాయికృష్ణను చంపి బూడిద చేస్తే.. సిఎం చంద్రబాబు నాయుడు సహచర పార్టీలతో మాట్లాడించి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సాయికృష్ణ కేసులో ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఇంటర్వెల్ కార్డు పడిపోయిందని, ఇక సెకెండ్ హాఫ్ దద్ధరిల్లి పోతుందని ఈ సినిమాలో విలన్లు, చంద్రబాబు, లోకేష్ అయితే.. హీరో జగన్ మోహన్ రెడ్డి అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.









