
హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సచివాలయం వద్ద ధర్నా చేశారు. వరి ధాన్యం రోడ్డుపై పోసి నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తోందని.. అన్నదాతను అరిగోసలు పెడుతోందని ఆరోపించారు.
తెలంగాణ రైతుల గోస ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి తెలియాలనే సచివాలయం ఎదుట ధర్నా చేపట్టినట్లు కవిత తెలిపారు. రెండున్నర ఏళ్లలో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యంతో పాటు జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కవితతోపాటు ఆ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు ఫలక్‌నుమా పీఎస్‌కు తరలించారు.













