
సియోల్: కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు అస్మిత ఛాలియా, రక్షిత రామ్‌రాజ్‌లు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీల్లో రక్షిత భారత్‌కే చెందిన తన్వి శర్మను ఓడించి ముందంజ వేసింది. ఆసక్తికరంగా సాగిన పోరులో రక్షిత 1821, 2119, 2118తో ప్రపంచ 30వ ర్యాంక్ క్రీడాకారిణి తన్వి శర్మను కంగుతినిపించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు రక్షిత అటు తన్వి ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరులో ఉత్కంఠ నెలకొంది. అయితే ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెట్‌లో తన్వి జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్ కోల్పోయినా రక్షిత ఒత్తిడికి గురి కాలేదు. రెండో సెట్‌లో దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది.
తన్వి కూడా మెరుగైన ఆటను కనబరిచింది. దీంతో ఈసారి కూడా హోరాహోరీ తప్పలేదు. కానీ కీలక సమయంలో తన్వి ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన రక్షిత సెట్‌ను దక్కించుకుంది. ఫలితాన్ని తేల్చే మూడో సెట్ కూడా నువ్వానేనా అన్నట్టుగానే కొనసాగింది. ఇద్దరు షట్లర్లు సర్వం ఒడ్డి పోరాడారు. అయితే చివరివరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన రక్షిత సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచి మందంజ వేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో అస్మిత టాప్ సీడ్ హినా అకెచి (జపాన్)ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన సమరంలో అతస్మిత 2022, 2115, 2119తో హినాను ఓడించింది. తొలి సెట్‌ను కోల్పోయిన అస్మిత ఆ తర్వాత దూకుడైన ఆటతో చెలరేగి పోయింది. వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.








