
సెప్టిక్ ట్యాంక్ కోసం గుంత తవ్వుతున్న సమయంలో ఇంటి కింద భాగంలో సొరంగం బయటపడిన సంఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో చోటు చేసుకుంది.ఒక ఇంటి ప్రాంగణంలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం కూలీలు గుంత తవ్వుతుండగా లోపలి భాగంలో పెద్ద గుహ లాంటి సొరంగం కనిపించింది. గుంత తవ్వుతున్న కొద్దీ మట్టి కిందకి పడిపోవడంతో అనుమానం వచ్చిన కార్మికులు పరిశీలించగా, లోపల విశాలమైన మార్గం (సొరంగం) ఉన్నట్లు గుర్తించారు.సమాచారం మేరకు అధికారులు, జియాలజీ శాఖ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇది పూర్వకాలంలో ఏర్పడిన సహజసిద్ధమైన భూగర్భ గుహ అయి ఉంటుందా లేక గతంలో నీటి నిల్వ కోసం లేదా రహస్య మార్గంగా తవ్విన సొరంగమా అనే కోణంలో అధికారులు పరిశోధిస్తున్నారు.కొత్త ఇంటి కిందే లోతైన గుహ వంటి సొరంగం బయటపడటంతో ఇంటి భద్రతపై యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సొరంగం కారణంగా అందులో నివసించేందుకు కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారట.సొరంగం చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకి తరలి వస్తున్నారు.








