జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీశ్ కుమార్ శుక్రవారం బిహార్ ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేసి కొత్త ఇంటికి మారారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన 1 ఆన్ మార్గ్‌లోని అధికార నివాసంలో ఉంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నితీశ్ కుమార్, ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరుసటిరోజు బీజేపీ నేత సమ్రాట్ చౌధరి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

నితీశ్ కుమార్ నవంబర్ 2005 నుంచి బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. మేము 1 ఆన్ మార్గ్ నుంచి 7 సర్క్యులర్ రోడ్‌కు మారాం. ఇక అక్కడే నివసిస్తాం అని నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ మీడియాకు తెలిపారు. 2006లో 1 ఆన్ మార్గ్‌ను బిహార్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిశాంత్ ప్రజలకు బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా తెలిపారు.