చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయగన్ సినిమా విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో సినిమాను కావాలనే లీక్ చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. సినిమా దర్శకుడు హెచ్ వినోద్ స్పందించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాను ఎవరైనా లీక్ చేసుకుంటారా? అని ప్రశ్నించాడు. దురుద్దేశంతో లీక్ చేస్తే అధికారులు కొన్ని గంటలు, రోజుల్లోనే తెలిపిపోతుందని వివరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ గెలుపు కోసమే మూవీని లీక్ చేశానడంలో నిజం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఆరోపణలు సరికాదని దుయ్యబట్టారు. విజయ్ అప్పుడే స్పందించి ఉంటే విమర్శలు వచ్చేవి కావన్నారు. ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని, సినిమా లీక్‌పై నిర్మాతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేస నమోదు చేసి చర్యలు కూడా తీసుకున్నారని వినోద్ పేర్కొన్నారు. గత ఆరు నెలల తనకు ఎంతో కష్టంగా అనిపించిందని, శ్రమకు తగిన ఫలితం లభిస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.