
సిఎం రేవంత్ రెడ్డి బండి భగీరధ్‌ను రక్షించాలని చూస్తున్నారని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఈ కేసులో భగీరథ్ పాత్ర ఎంత ఉందో బండి సంజయ్, సంగప్ప పాత్ర అంతే ఉందని అన్నారు.అయినా బండి సంజయ్‌కు, సంగప్పకు పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బండి భగీరధ్‌కు బెయిల్ వచ్చిన విషయం ఎవరికి తెలియదని, బెయిల్ వచ్చిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని అడిగారు. మహేంద్ర యూనివర్సిటీలో బండి భగీరధ్‌పై రెండు కేసులు ఉన్నాయని చెప్పారు. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ బయటకు వచ్చింది..కానీ, బెయిల్ ఆర్డర్ ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. బండి భగీరధ్ ఒక్కడికే మహేంద్ర యూనివర్సిటీ స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి...? అని అడిగారు.
చర్లపల్లి జైలులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ సెంటర్ ఉంటుందని, పరీక్షలు జైల్లో పెట్టవచ్చు లేదంటే పోలీస్ ప్రొటెక్షన్‌తో మహేంద్ర యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్షలు రాయించి తిరిగి జైలుకు తీసుకు రావచ్చని అన్నారు. భగీరథ్ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు బలమైన వాదనలు వినిపించలేదని నిలదీశారు. బండి భగీరథ్ బెయిల్‌కు సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే బండి భగీరధ్‌కు సహకరిస్తోందని ఆరోపించారు. బాల్క సుమన్ జైలు నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం స్పెషల్ పీపీని నియమించిందని, బాల్క సుమన్‌ను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని పేర్కొన్నారు. పోక్సో కేసులో బాధితురాలికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఈ కేసులో ఇంకా ఎందుకు ఛార్జీషీట్ వేయడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. ఈ కేసును నీరు గార్చే ప్రయత్నాలను బిఆర్‌ఎస్ ప్రతిఘటిస్తుందని చెప్పారు.
పోక్సో కేసు నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీస్ అధికారులకు శిక్షలు తప్పవు అని హెచ్చరించారు. బండి భగీరథ్ బెయిల్‌పై న్యాయస్థానం పునరాలోచన చేయాలని కోరారు.ఈ విషయాన్ని తెలంగాణ హై కోర్టు దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. బిజెపి అగ్రనేత బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు తీసుకున్నారనే విషయం బయటకు వస్తే బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, లక్ష్మణ్ మాదిగ అనే ఆయనపై బిజెపి చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. బంగారు లక్ష్మణ్‌కు ఒక రూల్, బండి సంజయ్‌కు ఒక రూలా..? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీ, సిఎం రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ఒకే వేదిక పంచుకున్నారని, కాంగ్రెస్ బిజెపి పార్టీలు కుమ్మకై బండి భగీరథ్‌ను కాపాడుతున్నాయని ఆరోపించారు. మహిళల రక్షణ కోసం కెసిఆర్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.













