
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘ఎలాంటి ఆధారాలు లేకుండా సిఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. గ్లోబరీనా సంస్థతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమన్య హక్కులు లేవు. గ్లోబరీన నా బినామీ కంపెనీ అనడం.. సిబిఎస్ఇ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉంటూ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు. రాజకీయ లబ్ధికోసమే నా ప్రతిష్ఠను దెబ్బ తీసేలా దురుద్ధేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. గడువులోపు క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తాం’’ అని కెటిఆర్ అన్నారు.











