
చెన్నై: టివికె చీఫ్ విజయ్ ఆదివారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తిరుచ్చి ఈస్ట్.. పెరంబూర్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి.. రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే తాజాగా పెరంజూర్ స్థానంలో ఎమ్మల్యేగా కొనసాగాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేయనున్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓ అభ్యర్థి ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయొచ్చు. అయితే ఆ రెండు స్థానాల్లో విజయం సాధిస్తే.. ఒక దానికి రాజీనామా చేయాలి. తమిళనాడులో అన్నాడిఎంకె అధినేత్రి దివంగత జయలలిత తర్వాత ఏకకాలంలో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన నేతగా విజయ్ గుర్తింపు పొందారు.














