
మనతెలంగాణ/హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమిన ల్ వేస్ట్’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కు కాం గ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నైతిక బాధ్యత వహించాలని బి ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. భారత ఇం జినీర్లు అంతర్జాతీయంగా సత్తా చాటుతుంటే రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ దివారం రాహుల్‌గాంధీకి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఒకవై పు భారతదేశ ఇంజినీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అం తరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే.. అలాంటి వారిని ‘కిమినల్ వేస్ట్’ అని రేవంత్‌రెడ్డి అనడం తగదని అన్నారు. రాహుల్ గాంధీ ఈ అంశంలో మౌనంగా ఉండటమంటే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లేనని పేర్కొన్నారు. ఈ అంశంలో ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆదేశించకపోవడం, రేవంత్ రెడ్డి తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం... ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేత రాహుల్ గాంధీ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
‘బీరు-బిర్యానీ బ్యాచ్’ అంటూ అవమానించారు
తెలంగాణ యువత ఓట్లు అడిగి వారిని మభ్యపెట్టిన రాహుల్ గాం ధీకి తన నైతిక బాధ్యతను గుర్తు చేయడానికే ఈ లేఖ రాస్తున్నానని కెటిఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు కాదని, తమ పిల్లలను చదివించేందుకు కష్టపడుతున్న ల క్షలాది తల్లిదండ్రులను, భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న విద్యార్థుల ను, జీవితాన్ని విద్యకు అంకితం చేసిన అధ్యాపకులను అవమానిం చే వ్యాఖ్యలని కేటీఆర్ అన్నారు. ఇది ఒక్కసారిగా జరిగిన ఘటన కాదని, రేవంత్ రెడ్డి గతంలో కూడా విశ్వవిద్యాలయ విద్యార్థులను ‘బీరు -బిర్యానీ బ్యాచ్’ అంటూ అవమానించారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పైన స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ యువత ఆత్మగౌరవంపైన, ఆత్మవిశ్వాసంపైన రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వెంటనే విద్యార్థులకు, గురువుల కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి వ్యా ఖ్యలకు దేశంలోని ప్రతి విద్యార్థికి, ప్రతి ఇంజనీర్‌కు, ప్రతి ఇంజనీరింగ్ అధ్యాపకుడికి, ప్రతి యువకుడికి రాహుల్ గాంధీ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించాలని డిమాండ్ చేశారు.








