హైదరాబాద్‌: సికింద్రాబాద్ ప్రాంతంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు.  పొరుగింటి బాలికతో కలిసి అక్కాచెల్లెలు వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... దోమలగూడలో అక్కాచెల్లెలు సహిత కుమారి(16), స్నేహ కుమారి(14)లు ఇంటి పక్కనే ఉన్నబంధువు రోహిణి కుమార్తె లత (14)తో కలిసి ఆటోలో వెళ్లారు. హిమాయత్‌నగర్‌లో ముగ్గురు ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగినట్టు సిసి టివి ఫుటేజీ లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ముగ్గురు బాలికల కోసం గాలింపు చేపట్టారు.