
స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ఉన్న సింగరేణి ఉద్యోగులకు ఇకపై సహజ మర ణానికీ పది లక్షల ఉచిత బీమా సదుపా యం కలుగనుంది. ఈ మేరకు సింగరేణి కా లరీస్ కంపెనీ లిమిటెడ్ గురువారం హైద రాబాద్ సింగరేణి భవన్‌లో ఎస్‌బిఐతో గ్రూ ప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒప్పందం కుదు ర్చుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదా ల్లో మృతి చెందిన వారికి మాత్రమే ఎస్‌బిఐ కోటి బీమా అందిస్తుంది. సిఎండి బుద్దప్రకా ష్ జ్యోతి ఆదేశాలు, డైరెక్టర్ పర్సనల్, ఫైనా న్స్ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవతో సహజ మరణ బీమాను కూడా అమలు చేసేందుకు ఎస్‌బిఐ అంగీకరించింది.
ఈ పథకంతో సం స్థలోని 40 వేల మంది ఉద్యోగులకు ప్రయో జనం చేకూరనుంది. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానిం గ్, ప్రాజెక్ట్ కె. వెంకటేశ్వర్లు సమక్షంలో జీ ఎం పర్సనల్ కిరణ్ కుమార్, ఎస్‌బీఐ డిజి ఎం సిఎస్‌పి నీలాక్షి సింగ్ ఒప్పందంపై సం తకాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (ప ర్సనల్) కిరణ్ కుమార్, డిజిఎం (పర్సనల్) సత్యనారాయణ, ఎస్‌బిఐ అసిస్టెంట్ జనర ల్ మేనేజర్ మురళీకృష్ణ, సీనియర్ అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










