
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన కుమార్తె సితారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను ప్రేమతో ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన మహేశ్ ఎంత ఎదిగినా సితార తన లిటిల్ స్టారేనంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘నువ్వు ఎంత పెద్దదానివైనా.. నాకు మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మహేశ్ చేసిన ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరోవైపు మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టారు. ‘మా జీవితాల్లో ఎంతో ఆనందం, ప్రేమను నింపిన నా అందాల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు నీ ఎదుగుదలను చూస్తుండటం నాకు దక్కిన అతి పెద్ద వరం. హ్యాపీ బర్త్ డే. ప్రేమతో..’’ అని ఆమె పేర్కొన్నారు.











