జగిత్యాల జిల్లా కేంద్రంలోని యవార్ రోడ్డులో  ఆర్టీసీ అద్దె బస్సు, ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలవ్వగా రెండు బస్సులకు నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతినగా పాఠశాల బస్సు స్వల్పంగా దెబ్బతింది.ప్రమాద సమయంలో పాఠశాల బస్సులో మొత్తం 26 మంది విద్యార్థులు ఉండగా వారిలో ఇద్దరికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి.మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు బ్రేకులు పడకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.