
జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో రియాసి జిల్లాలోని సలాల్ జలవిద్యుత్ కేంద్రం అన్ని గేట్లను అధికారులు ఎత్తివేశారు. నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని, పశువులను తోలుకెళ్లవద్దని ,నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.











