బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ఓ కార్యక్రమంలో కాస్త సన్నగా, అలసిపోయినట్లు కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్‌లో స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను షేర్ చేసి ’మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?’ అనే క్యాప్షన్‌ను జత చేశారు.

ఈ పోస్ట్ తో ఆయన ఆరోగ్యంపై వస్తున్నా వదంతులకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తాను క్షేమంగానే ఉన్నానని అభిమానులకు హింట్ ఇచ్చారు. దీనికి బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ... పలువురు నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్లు చేయగా, మరికొందరు మీరిలాగే ఫిట్‌గా ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం... అంటూ శుభాకాంక్షలు తెలిపారు.