
తెలుగు నటుడు సుహాస్, తమిళ నటుడు సూరి కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘మండాడి’. మతిమారన్ పుగళేంది ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘పందెం అనేది ఎవరు పెద్ద మొనగాడో చూపించుకోవడానికి జరిపే పోటీ కాదు.. పందెం అంటే తెలివి’ వంటి డైలాగ్‌ను సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా సముద్రం మీద సాగే బోట్ రేసింగ్‌లు యాక్షన్ సీన్స్ అలరిస్తున్నాయి. మహిమ నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.








