పారిస్/వాషింగ్టన్: ప్రపంచ శాంతికి ముందుగానే ముందడుగు పడింది. పశ్చిమాసియా యుద్ధం ముగింపు దిశలో ప్రాధమిక ఒప్పం దం అవగాహన పత్రాలపై అమెరికా, ఇరాన్‌లు సంతకాలు చేశాయి. జి 7 సదస్సుకు ఫ్రాన్స్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షులు తీరిక లేకుండా ఉ న్నా బుధవారం ఉన్నట్లుండి ఈ డీల్ మొదటి ఘట్టం ఆరంభం అని ప్రకటించారు. పలువురు నేతల సమక్షంలో ఇరాన్‌తో తొలి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరాన్ తరఫున దేశాధ్యక్షు లు మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ నుంచి వ ర్చువల్‌గా సంతకం చేశారు. 14 అంశాలతో కూడిన ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాడింగ్ బిట్విన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు ఇరాన్, అమెరి కా అగ్రనేతల సంతకాలతో ఇక యుద్ధం తక్షణ ముగింపునకు వీలేర్పడిందని మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఫ్రాన్స్‌లోని చారిత్రకమైన పలు కీలక ఒప్పందాలకు వేదికగా నిలిచిన వెర్సైల్స్ ప్యాలెస్ వేదికగా సంతకాలు జరిగాయి. ఓ వైపు ఫ్రెంచ్ అధ్యక్షులు మెక్రాన్ ఇతర నేతలతో కలిసి విందు ఆరగిస్తున్నప్పుడే ట్రంప్ ముందుకు ఈ పత్రాలు వచ్చాయి.


వీటిపై ఆయన సంతకాలు చేశారు. డీల్ ఓకె అని మెక్రాన్‌తో ట్రంప్ చెప్పడం, ఆయన కంగ్రాట్స్ తెలియచేయడం అంతా సెకండ్లలో జరిగింది. ఇక శుక్రవారం జెనీవాలో ప్రధాన ఒప్పందం సంతకాలు ఉంటాయా? ఇప్పుడు కుదిరిందే ఫైనలా అనే సందేహాలు తలెత్తాయి. అయితే శుక్రవారం అధికారికంగా సంతకాల ప్రక్రియ జెనీవాలో ఉంటుందని, ఈ క్రమంలోనే డీల్‌కు ఐరాస సంబంధిత ఆమోదముద్ర పరిధి దక్కుతుందని దౌత్యవర్గాలు తెలిపాయి. అంశాలపై చర్చలు తరువాత సాగుతాయి. ముందు హర్మూజ్ తెరుచుకోవడం, యుద్ధం ముగించడం, ఈ క్రమంలో క్రమేపీ ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఎత్తివేత ఈ ప్రాధమిక ఒప్పందంలోని కీలక అంశాలుగా నిలిచాయి. ప్రపంచం అంతా అమెరికా, ఇరాన్ మధ్య శుక్రవారం ( 19వ తేదీన) స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అధికారిక లాంఛనపూర్వక ఒప్పంద సంతకాలకు ఎదురుచూస్తోంది. దీనికి రెండు రోజుల ముందు ఒప్పందం ఎంఒయు వెలుగులోకి వచ్చింది. సంతకాల ప్రక్రియను ఆ తరువాత ఇరాన్ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి కూడా ఇరాన్ నుంచి ధృవీకరించారు. 14 అంశాల ఈ ఎంఒయూలోని అంశాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు. ఇప్పుడు సంధి దశ ఆరంఒభం అయింది.


పూర్తి స్థాయిలో కుదిరే శాంతి ఒప్పందానికి ఇప్పటి నుంచి 60 రోజుల వేచిచూసే దశ ఆరంభం అయింది, ఇది క్లాక్ వంటిదని ,ఈ దశలో పరస్పరం సంబంధిత పక్షాలు ప్రాధమిక ఒప్పందంలోని అంశాలను ఏ విధంగా అమలు చేస్తున్నాయనేది కీలకం అవుతుందని దౌత్యవర్గాలు తెలిపాయి. ప్రాధమిక అంచనాల మేరకు చూస్తే ఈ డీల్‌తో ఇరాన్ ఎక్కువగా లబ్థి పొందుతుంది. యుద్ధం ఆరంభించిన అపఖ్యాతితో పాటు అమెరికాకు ఈ డీల్‌తో దక్కిన ప్రయోజనాలు అంతంతే అని స్పష్టం అయింది. డీల్ అయిపోయినట్లే అని మీడియాతో ట్రంప్ చెప్సేసి వెళ్లారు. రేపటి జెనీవా సంతకాలపై సస్పెన్స్ మిగిల్చారు. పక్కన విదేశాంగ మంత్రి రూబియో నిలుచుని ఉండగా ట్రంప్ సంతకాలు చేసి, ఈ పత్రం, పెన్ను ఆయన చేతికి అందించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి టెహరాన్‌లో స్పందించారు. 60 రోజుల పాటు అమెరికా ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగకూడదు. వ్యూహాత్మక సైనిక మెహరింపులు కుదరదు. ఇరాన్ సంతరించుకున్న శుద్ధిచేసుకున్న యురేనియం ఇరాన్ వద్దనే ఉంటుంది. విదేశాలకు తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము మునుపటిలాగానే అణ్వాయుధాల తయారీ జోలికి వెళ్లడం లేదని వివరించారు.