ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీసుల్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సంజు శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు. అయితే అతడిని ఎందుకు తప్పించారని కొందరు ప్రశ్నిస్తే.. మరికొందరు మాత్రం అతడిని పక్కన పెట్టడాన్ని సమర్థించారు. ఇక జింబాబ్వే పర్యటనలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అందరగొట్టాడు. అద్భుతమైన ఆటతీరుతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలిచాడు. దీంతో ఇప్పటికైతే ఓపెనింగ్ ప్లేస్ ఖాళఈగా లేదనే చెప్పుకోవాలి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘మన దేశంలో నిరంతరం పోటీ ఉంటుందని తెలుసు. అయితే, 2026 టి-20 ప్రపంచకప్ ముందు ఇందులో నేను భాగం కాకూడదని నిర్ణయించుకున్నా. నా గేమ్‌ను ఆస్వాదించడంపైనే దృష్ట పెట్టా. దేవుడి దయ వల్ల నేను చాలా సాధించా. ఇప్పుడు నా వయసు 31 ఏళ్లు. ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడగలను. అందుకే, సొంత శైలిలోనే ఆడాలని అనుకుంటున్నా. ఎలా బ్యాటింగ్ చేయాలో నాకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంజు ఎలా ఆడాలో సంజునే డిసైడ్ చేస్తాడు. 2024 వరల్డ్ కప్ తర్వాత 2026లో ఆడతానని అనుకోలేదు. కనీసం 15 మంది స్వ్కాడ్‌లో కూడా ఉంటానని భావించలేదు. అయినా నాకు అవకాశం వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఛాన్స్ అది. అందువల్ల నేను 2028 కోసం ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాను? నా అవసరం జట్టుకు ఉందని అనిపిస్తే ఎంపిక చేస్తారు. అప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ప్రయత్నిస్తా’’ అని సంజు చెప్పుకొచ్చాడు.