మన తెలంగాణ/పరిగి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని నిలువునా దగా చే సిందని, వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యమే కారణమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. ‘రైతు గోస బీజేపీ భరోసా’ యా త్రలో భాగంగా తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృం దం వికారాబాద్ జిల్లా పరి గి నియోజకవర్గంలోని కు లకచర్ల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, క్షేత్రస్థాయిలో రైతున్నలతో ము ఖాముఖిగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణ రైతాంగా న్ని నిలువునా దగా చేసిందన్నారు. నేడు రాష్ట్రంలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని మండిపడ్డారు.

ఆరుగాలం కష్టపడి పం డించిన పంటలను అమ్ముకోవడానికి రైతన్నలు కొ నుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి పడిగాపు లు కాయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయ ని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షం, కనీస ముందస్తు ప్రణాళిక లేకపోవడం, సకాలం లో ధాన్యం సేకరించడంలో ఘోరం గా విఫలమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని చెప్పారు. తెలంగాణలోని కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ, ఎక్కడెక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారో, ఎక్కడైతే కొనుగోళ్లు సజావుగా జరగడంలేదో ఆయా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవస్తున్నామన్నారు.

రెండు నెలల క్రితమే మా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మీనర్సయ్య ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొనుగోళ్లు సకాలంలో జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరించిందని వివరించారు. రాష్ట్రంలో దాదాపు ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ ధాన్యం కుప్పలు పేరుకపోయాయని, రైతులు గత పది, పదిహేను రోజలుగా లారీలు ఎప్పుడు వస్తాయో, తమ ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోళ్లు చేస్తారోనని కళ్లలో ఒత్తులు వేసుకుని వేచి చూస్తున్నారన్నారు. కేంద్రాలలో టార్పాలిన్లు, గోనె సంచులు లేక లారీలు రాక తూకాలు సకాలంలో జరగడం లేదన్నారు. దీంతో రైతాంగం అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ బృందం వస్తుందనే తెలిసి రాత్రికిరాత్రే ఆగమేఘాలపై రైతుల ధాన్యాన్ని తరలించారని మండిపడ్డారు. పూర్తిస్థాయి కొనుగోళ్లు జరగకుండానే అధికారులు కొనుగోళ్లు చేశామని అబద్ధం చెప్పడం ఎంత దారణమన్నారు. చివరి గింజవరకు కొనుగోళ్లు చేస్తామని ప్రగాల్భాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని హెచ్చరించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా తక్షణమే రైతులకు కొనుగోళ్ల కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, వేగవంతంగా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శాసనమండలి పక్షనేత ఏవీఎస్‌రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు మాట్లాడుతూ.. రైతులు తీవ్రమైన ఇబ్బందులతో గోస పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదన్నారు. ప్రజలను, రైతులను మాయ చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు రోజుల తరబడి వానలో, ఎండలో నిలబడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వేచి చూస్తున్నారన్నారు. గోనె సంచుల నుంచి సుతిల్ కుట్టే దబ్బునం వంటివి కూడా రైతులే తెచ్చుకుంటున్నారన్నారు. రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమలంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాధవనేని రఘునంద్‌న్‌రావు, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్‌రెడ్డి, డాక్టర్ పాల్వయి హరీశ్‌బాబు, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, సి.అంజిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీనర్సయ్య, బీజేపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్‌రావు, మాజీ అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కే.శరత్‌కుమార్‌రెడ్డి, పరిగి నాయకులు మిట్ట పరమేశ్వర్‌రెడ్డి, మారుతి కిరణ్ భూనేటీ, పెటయ్యగుప్త, బాలకృష్ణారెడ్డి, రాంచంద్రయ్య, రాముయాదవు, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.