న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను తరచూ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటారు. లేటెస్ట్‌గా మోడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆయన దైనందిన జీవితంలో వన్య ప్రాణులకు ప్రాముఖ్యత ఇస్తారనే విషయం తెలిసిందే. అలా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటకు వెళ్లే ముందు తన ఇంటిలోని నెమళ్లు, లేగదూడలకు ఆహారం అందించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఆ మూగజీవాలను తన స్నేహితులుగా ప్రధాని వీడియో డిస్‌క్రిప్షన్‌లో పేర్కొన్నారు. రోజూ వాటికి మేత వేయడం తన దిన చర్యలో భాగమని తెలిపారు.