
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నేతృత్వంలో నేతలు కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ‘సర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పాతబస్తీలో సర్ నిర్వహణకు సీనియర్లకు బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిజెపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ సిఇవొకు ఆయన ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై అనర్హులను చేరుస్తున్నారని ఆరోపించారు. ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన వారికి ఓటు హక్కు లేకుండా చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.











